సమాచారహక్కు చట్టం బిల్లులో మార్పులు

తక్షణ సమావేశానికి కమిషన్‌ లేఖ

న్యూఢిల్లీ,జూలై23(జ‌నంసాక్షి): సమాచార హక్కు చట్టంలో మార్పుల కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సమాచార కమిషన్‌ సభ్యుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇది రాజ్యాంగ విరుద్దంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై చర్చించేందుకు వెంటనే కమిషనర్ల భేటీ ఏర్పాటు చేయాలని కేంద్ర సమాచార కమిషనర్‌ డాక్టర్‌ మాడభూషి శ్రీధర్‌ కోరారు. ఈ మేరకు సీనియర్‌ కమిషనర్‌ యశోవర్థన్‌ ఆజాద్‌కు లేఖ రాసారు. బిల్లులో కేంద్రం చేసిన ప్రతిపాదనలు సమాచార హక్కు చట్టం అసలు ఉద్దేశాలను దెబ్బతీసేలా ఉన్నాయని మాడభూషి శ్రీధర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొనేలా కేంద్రానికి అధికారిక సమాచారం అందజేయాలని ఆయన ఈ లేఖలో కోరారు. సమాచార హక్కు కమిషన్‌కు రాజ్యాంగ బద్ధ ¬దా తొలగించడం సహా కమిషనర్ల జీతభత్యాలు, పదవీకాలంలో మార్పులు చేసేందుకు కేంద్రం బిల్లు రూపొందించింది. రాజ్యాంగబద్ధ ¬దా తొలగించాలన్న ప్రతిపాదనలపై అభ్యంతరం వ్యక్తం చేసిన మాడభూషి శ్రీధర్‌.. కేంద్రం రాజ్యాంగ నియమాలను ఉల్లంఘిస్తోందని విమర్శించారు.