సమాచార చట్టం పై ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులపై చర్య తీసుకోవాలి.
జల్లి గ్రామస్తుడు కాట కుమారస్వామి.
జనం సాక్షి,చెన్నారావుపేట
సమాచార చట్టం పై ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులపై చర్య తీసుకోవాలని జల్లి గ్రామస్తుడు కాట కుమారస్వామి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళా సంఘం 28/ 6/ 2002 రోజున చెన్నారావుపేట ఏపిఎంకి సంఘాలు ఆడిట్ చేయమని వినతి పత్రం ఇచ్చానని, ఆ ఖర్చు మొత్తం తనదే అని జల్లి గ్రామానికి చెందిన కాట కుమారస్వామి లిఖిత పూర్వకంగా ఇచ్చానని, 3/7/2022 నాడు ఆడిట్ వెంకట్ తనకు ఫోన్ చేసి ఆడిట్ చేస్తామని దానికి నాతో ఫోన్లో సంభాషణ చెప్పాడు, దానికి నేను ఓకే అని చెప్పాను, కానీ అతను ఆడిట్ చేయలేదు ,22/7/2022 నాడు మహిళా సంఘం సిఎ ఆధ్వర్యంలో మహిళ భవనానికి పిలిచారు .ఆరోజు వాదొప వదల తర్వాత నేను సమాచార హక్కుల చట్టం 2005 సెక్షన్ 6 ,7. పది అంశాల మీద 28/7/2022 నాడు ఫిర్యాదు చేశాను. 30 రోజులు అయిన తర్వాత మరల 29/8/2022 ఎంపీడీవో దగ్గర ఫిర్యాదు చేయడానికి వెళితే అధికారులకు ఇబ్బంది అవుతుందని తెలిసి సెక్షన్ 19(1) చట్ట పరమైన చర్యలు ఉంటాయని తెలిసి నాతో ఏపిఎం ఈశ్వర్, ఎంపీడీవో దయాకర్ నాతో వాదోపవాదాలకు దిగారు. ఆ విషయం గ్రహించిన మీడియా వాళ్ళు అక్కడికి రావడంతో వెంటనే వారు అడిగారని, సమాచార హక్కు పత్రం ఇచ్చినప్పుడు తీసుకోవాల్సిన బాధ్యత మీ అధికారులకు ఉంది అనడంతో వారు రిసీవ్డ్ కాఫీ వెంటనే నాకు ఇచ్చారు. ఇది మహిళా విభాగం మండల అధికారులు ఇంత దారుణంగా ఉంటారని నేను అనుకోలేదనీ వాపోయాడు. మీటింగ్ జల్లి మహిళా భవనంలో సర్పంచ్ ముందు మీటింగ్ ఏర్పాటు చేసి సిఎ తప్పు చేశారా, తప్పు చేయకపోతే చేతులు ఎత్తండి అనడం ఒక అధికారికి ఇంతవరకు కరెక్ట్ కాదని, మీ విజ్ఞతకే వదిలేస్తున్నానని,ఇలా ప్రశ్నించే తత్వాన్ని ప్రతిచోట అడ్డుకుంటే రాష్ట్రస్థాయిలో అప్పిల్ చేయాల్సి వస్తుందని, ఒక సామాన్యుని గా గవర్నమెంట్ అధికారి ఎవరైనా సరే సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6 7 18 19(1) సెక్షన్ల కింద ఇస్తే సంబంధిత అధికారికి పంపవలసిందిగా వారి బాధ్యతని, లేనియెడల శిక్ష అర్హులవుతారని, సెక్షన్ 167, 166, 165 నేరం అనుభవించక తప్పదన్నారు.