*సమాజ సేవలో నిరంతర శ్రామికుడు పిల్లుట్ల రఘు*
*జనస్వరంగా మారిన ఓజో ఫౌండేషన్:-*
*కుక్కల వెంకన్న హుజూర్నగర్ ఇంచార్జ్*
మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్)
సూర్యాపేట జిల్లా, మేళ్లచెరువు మండలం ,వేపల మాదారం గ్రామంలోని 5&6వ వార్డు ప్రజల అవసరాల నిమిత్తం ఈ రోజు వారికి రెండు బోర్లను వేపించటం జరిగినది ఓజో ఫౌండేషన్ అధినేత గౌ” శ్రీ” పిల్లుట్ల రఘు అన్నగారి ఆదేశాల మేరకు,ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇన్చార్జ్ కుక్కల వెంకన్న వాటిని ఓపెన్ చేయడం జరిగినది వారు మాట్లాడుతూ ఈ వేపల మాదారం గ్రామంలో ఓజో ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చెయ్యటం జరిగినది,
1,వినాయక విగ్రహలు ఇవ్వడం 2,అన్నదాన కార్యక్రమాలు చేయడం 3,అమ్మవారి విగ్రహం ఇవ్వడం , 4,బతుకమ్మ గిఫ్టులు ఇవ్వడం
5,కోలాటం మహిళలకు చీరలు ఇవ్వడం 6,పీర్లచావిడి నిర్మాణం
7,వాలీబాల్ టోర్నమెంట్ కి ఆర్థిక సహాయం చెయ్యడం
8,ఎంతో మంది చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక చేయూత నివ్వడం
9,ఎస్సై ,కానిస్టేబుల్, కోచింగ్ ఇప్పించటం
10,కళాకారులను ప్రోత్సాహించటం
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క గ్రామంలో చెయ్యటం జరిగినది ఈ గ్రామాన్ని కాదు యావత్తు హుజూర్ నగర్ నియోజకవర్గం మొత్త౦ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తు ముందుకు పోవడం జరుగుతుంది కాబట్టి మీ అందర్నీ ఒక్కటే వేడుకుంటున్నా మనకు సేవ చేసే రఘు లాంటి నాయకుడు కావాలి మనం సేవ చేసే నాయకుడు మనకు అవసరం లేదు గతంలో రఘు కరోనా టైంలో యావత్ హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని వైద్యశాలల్లో శానిటైజర్స్ మాస్కులు పంపిణీ చెయ్యటం జరిగినది, ఎంతో మందికి ఉచితంగా వైద్యం చేయించటం జరిగినది,రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేసే విధంగా యావత్తు హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తోడుగా ఉండి ముందుకు నడిపించాల్సిందిగా కోరడం జరిగింది
ఈ కార్యక్రమంలో
ఓజో ఫౌండేషన్ హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుక్కల వెంకన్న,రజాక్, శంకర్, పెద్దగట్టు, రఫీ, వీరయ్య, వేణు, అశోక్,వెంకన్న,యల్లావుల శివశంకర్ యాదవ్,బోమ్మకంటి సైదులు,మహేందర్ రెడ్డి, సునీల్, వీర్ల అంజి,తదితరులు పాల్గొన్నారు