సమైక్యతతోనే సుస్థిరాభివృద్ధి సాధ్యం

-ఎమ్మెల్యే శంకర్ నాయక్

మహబూబాబాద్ బ్యూరో- సెప్టెంబర్16(జనంసాక్షి)

సమైక్యతతోనే సుస్థిరాభివృద్ధి సాధ్యమని ,బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు
కె.చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు శుక్రవారం పట్టణంలో ఘనంగా జరిగాయి. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు వివిధ కళా రూప ప్రదర్శనలతో భారీ ఎత్తున నిర్వహించిన ర్యాలీ అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో శాసనసభ్యుల అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, అనేకమంది త్యాగాల అనంతరం ముఖ్యమంత్రివర్యుల సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత ఎనిమిదేళ్లలో అన్ని రంగాలలో గణనీయమైన అభివృద్ధి సాధించామని ప్రతి ఇంటికి త్రాగునీరు, రైతులకు కోట్లాది ఎకరాలకు సాగునీరు, దళితులకు దళిత బంధు, మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ, యాదవ సోదరులకు గొర్రెల పంపిణీ, రైతుబంధు రైతు బీమా, రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తున్నదని శాసనసభ్యులు తెలిపారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో 44 వేల మందికి ఆసరా పెన్షన్ అందిస్తున్నామని త్వరలోనే పేదవారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వడంతో పాటు స్థలం కలిగిన వారు ఇల్లు కట్టుకునేందుకు 3 లక్షల రూపాయలు అందిస్తామని తెలిపారు. ఆరోగ్య లక్ష్మి ద్వారా మహిళలకు పౌష్టికాహారం అందిస్తున్నామని, రైతులకు మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, సీఎం రిలీఫ్ ఫండ్, విదేశీ విద్యకై విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. దీనితోపాటు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ద్వారా పేదింటి ఆడపిల్లల వివాహాలకు నగదు ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని చెప్పారు. ధరణి ద్వారా దీర్ఘకాలిక భూ సమస్యలకు పరిష్కారం చూపి పట్టా పాస్ పుస్తకాలను అందిస్తున్నామని, ఆరోగ్య సదుపాయాలను పెంచామని, పరిశుభ్రత పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకున్నామని ఆయన తెలిపారు .నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నోటిఫికేశన్లు జారీ చేస్తున్నదని ,రాష్ట్రంలో పటిష్టమైన శాంతిభద్రతలతో అద్భుతమైన పరిపాలన జరుగుచున్నదని మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కె.శశాంక మాట్లాడుతూ రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలనకు చేరుకొని 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75 వ సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను మూడు రోజులపాటు నిర్వహిస్తుందన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం బలమైన అభివృద్ధి సాధించామని కలెక్టర్ తెలిపారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుమారి ఆంగోత్ బిందు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నిజాం పాలనలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నామని హక్కులకై అనేకమంది పోరాడారని వారిని స్మరించుకుంటూ వారి వారి ఆశయ సాధనలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం దేశంలో ఎక్కడ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రివర్యులు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుపుతున్నారని అన్నారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శరత్ చంద్ర పవార్, శిక్షణ కలెక్టర్ పరమర్ పిన్కేశ్వర కుమార్ లలిత్ కుమార్, అదన కలెక్టర్ ఎం డేవిడ్, డి ఆర్ డి ఓ సన్యాసయ్య, ఆర్డీవో కొమురయ్య వివిధ మండలాల జడ్పిటిసిలు ఎంపీటీసీలు ఎంపీపీలు సర్పంచులు స్థానిక ప్రజాప్రతినిధులు నియోజకవర్గ ప్రజలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.