సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలి
సకల జనుల సమ్మెకే వన్నె తెచ్చిన సింగరేణి గని కార్మికులకు ప్రభుత్వఉద్యోగులకు ఇచ్చిన విధంగా సమ్మె కాలం మొత్తాన్ని స్పెషల్ లీవుగా ప్రకటించి సింగరేణి కార్మికులకు అడ్వాన్స్‌గా ఇచ్చిన 25 వేల రూపాయలను మాఫి చేయాలని సీపీిఐ శాసన సభాపక్షనేత గుండామల్లేష్ డిమాండ్ చేశారు. స్థానిక కొమురయ్యభవన్‌లో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సకల జనుల సమ్మెలో పాల్గొన్న వారిపై ప్రభుత్వం వివక్ష చూపడం తగదని అన్నారు. త్వరలో జరగనున్న పరకాల ఉపఎన్నికల్లో టీిఆర్‌ఎస్ అభ్యర్థి మొలు గూరి భిక్షపతిని, సింగరేణి ఎన్నికల్లో ఏఐయూసీిని గెలిపించాలని కోరారు. సింగరేణి గడించిన లాబా ల్లో 25శాతం వాటాను కార్మికులకు ఇవ్వాలని తమపార్టీ ముఖ్యమంత్రిని కలిసి రాతపూర్వకంగా కోరిందని దీనికి ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సింగరేణి సిఎండికి లెటర్ రాశారని సిఎండి తక్షణం స్పందించి లాభాల్లో వాటాను జూన్‌లో కార్మికులకు చెల్లించాలని మల్లేష్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ కేంద్ర నాయకులు మల్లారెడ్డి, బ్రాంచి కార్యదర్శి రాజ్‌కుమార్, ఉపాధ్యక్షులు కొత్తపల్లి ఏడుకొండలు నాయకులు కనుకయ్య, కోటిలింగం, భీమా, శ్రీనివాస్, భీమనాధుని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.