సరిహద్దులు మూసేస్తున్న భూటాన్‌

– ఎన్నికల నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దు మార్గాలన్నింటికి సీల్‌
థింపూ, ఆగస్టు31(జ‌నం సాక్షి) :  దేశ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబర్‌ 14, 15 తేదీల్లో అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయాలని భూటాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని చీఫ్‌ ఎలక్షన్‌ సెక్యూరిటీ కోఆర్డినేటర్‌ ఒక నోటీసులో ప్రకటించారు. హిమాలయ దేశమైన భూటాన్‌కు ఇండియాతో పలు అంతర్జాతీయ సరిహద్దు రూట్లు ఉన్నాయి. సెప్టెంబర్‌ 15వ తేదీ ఎన్నికల రోజు కావడంతో  ప్రజాభద్రతను దృష్టిలో పెట్టుకుని పలు చర్యలు చేపట్టినట్టు నేపాల్‌ ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. 10వ తేదీ నుంచి సెక్యూరిటీ తనిఖీలు ఉంటాయని, దానిని దృష్టిలో పెట్టుకుని బయట తిరిగే ప్రతి ఒక్కరూ ఐడెండిటీ కార్డులు తప్పనిసరిగా ఉంచుకోవాలని స్పష్టం చేసింది. అంతర్జాతీయ సరిహద్దు మార్గాలన్నింటినీ ( ప్రవేశం, నిష్కమ్రణ ) సీల్‌ చేస్తామని, సెప్టెంబర్‌ 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ ఎలాంటి రాకపోకలను అనుమతించమని భూటన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.
——————————————–