సర్కార్‌ తీరుతో బడుగు విద్యార్థులకు అన్యాయం

ఏలూరు,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యారంగ ప్రయివేటీకరణ విధానాలనుఐక్యంగా తిప్పి కొట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాజశేఖర్‌ విద్యార్థులకు పిలుపునిచ్చారు. రేషనైలేజేషన్‌ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను ఈ ప్రభుత్వం మూసేస్తోందని అన్నారు. దీంతో దళిత, గిరిజన బడుగు బలహీన తరగతుల విద్యార్థులు చదువుకు దూరం కానున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడులను మూసేసేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందన్నారు. మరో వైపు మున్సిపల్‌ పాఠశాలల్లో బలవంతంగా ఇంగ్లీషు విూడియం అమలు చేస్తుండటం దుర్మార్గమని విమర్శించారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌ చార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలానే స్కాలర్‌ షిప్‌లు కూడా పెంచాలన్నారు. ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించేలా చర్యలు తీసుకొంటున్నారు. సంబంధిత డిమాండ్లపై ఈ నెల 24న రాష్ట్ర వ్యాపితంగా నిర్వహించనున్న ఆందోళనను జయప్రదం చేయాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.

తాజావార్తలు