సర్వత్రా హర్షాతీరేకం
ఆదిలాబాద్, డిసెంబర్ 2 : డీఏస్సీ-2012 మెరిడ్ జాబిత విడుదల ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు జాబిత విడుదల కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెరిడ్ జాబితాను శనివారం రాత్రి జిల్లా కలెక్టర్ అశోక్ విడుదల చేశారు. జిల్లాకు ప్రభుత్వం 1401 పోస్టులు మంజూరు చేసింది. 2012 డీఎస్సీలో ఈ పోస్టుల గాను 1088 మంది అభ్యర్థులు మాత్రమే దొరికారు. మిగితా 313 పోస్టుల గాను అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో మిగిలిపోనున్నాయి. 313 పోస్టులలో మైదాన ప్రాంతంలో 108 పోస్టులు, గిరిజన ప్రాంతాల్లో 205 పోస్టులు ఖాళీగా మిగలనున్నాయి. ప్రభుత్వం రోస్టర్ కమ్ రిజర్వేషన్ ప్రతిపాధికన పోస్టులను కేటాయించడంతో ఆయా సబ్జెక్టలలో అభ్యర్థులు దొరక్క జిల్లాలో భారీగా ఉపాధ్యాయ పోస్టులు మిగలనున్నాయి.