సర్వమత సమ్మేళనానికి సూర్యాపేట ప్రతీక
మహాత్ముడి ఆశయ సిద్ధికి సూర్యాపేట ప్రతిరూపం
సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో నాగరిక సమాజ నిర్మాణం
పట్టణాభివృద్ధికి విఘ్నాలను అధిగమించాలి
-మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): సర్వమత సమ్మేళనానికి సూర్యాపేట ప్రతీకగా నిలుస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.గంగా,జమునా, తహజీబ్ అన్న మహాత్మా గాంధీ పదాలు కచ్చితంగా సూర్యాపేటకే వర్తిస్తాయని అన్నారు.గణేష్ నవరాత్రోత్సవాలను ముగింపు సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శోభాయాత్రను మంత్రి ప్రారంభించారు.అంతకు ముందు వినాయకుడికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ 71 సంవత్సరాలుగా సూర్యాపేటలో నిర్వహిస్తున్న శోభాయాత్ర మహాత్మా గాంధీ ఆలోచనలకు అద్దం పట్టేలా ఉందన్నారు.ఇక్కడ జరుగుతున్న పండుగలు అన్నింటిలో సర్వమతాల భాగస్వామ్యం ఉండడం ప్రత్యేకం అన్నారు.అది రంజాన్ అయినా, క్రిస్మస్ అయినా దసరా, సంక్రాంతి అయినా అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి జరుపుకోవడం ఈ గడ్డకున్న ప్రత్యేకత అన్నారు.అంతే కాకుండా గణేష్ ఉత్సవ కమిటీ, స్థానిక భజన మండలి అద్వర్యంలో ఏడూ దశాబ్దాలుగా కొనసాగుతున్న వినాయకచవితి నవరాత్రోత్సవాలలోనూ, చివరిగా జరిగే గణేష్ శోభాయాత్రలోనూ హిందు, ముస్లిం, క్రిస్టియన్లు పాలు పంచుకోవడం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని కొనియాడారు.ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఎస్పి రాజేంద్రప్రసాద్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలిత ఆనంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు అనంతుల కృపాకర్ , ప్రధాన కార్యదర్శి రంగరాజు రుక్మారావు , ఉపాధ్యక్షులు బైరు వెంకన్న గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ చలమల్ల నర్సింహ్మ , యూత్ వింగ్ గండూరి రమేష్ , మొరిశెట్టి శ్రీనివాస్, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు తోట గణేష్ , బైరు విజయకృష్ణ ,తోట శ్యామ్ ప్రసాద్,చల్లా లక్ష్మీకాంత్, చీకూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.