సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేయాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): నేడు జిల్లా కేంద్రంలో నిర్వహించే కెవికె రైతు మిత్ర ఫౌండేషన్
సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేయాలని సంఘ ఫౌండర్ పగడాల ఉపేందర్ రెడ్డి కోరారు.గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన ఆ సంఘ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సర్వసభ్య సమావేశంలో భాగంగా నూతన కమిటీని ఎన్నుకోనున్నట్లు తెలిపారు.ఈ నెల 17న జరగనున్న రైతు మిత్ర అవార్డ్స్ , రైతు సేవా రత్న అవార్డ్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి, ఎడెబోయిన శ్రీనివాస్, ఎల్లినేని రాధాకృష్ణ , సతీష్ పాల్గొన్నారు.
Attachments area