సర్వీస్ రోడ్డు కొరకు హట్యా తండావాసుల రాస్తారోకో.

కూసుమంచి అక్టోబర్ 10 ( జనం సాక్షి ): సూర్యాపేట నుండి ఖమ్మం వరకు జరుగుతున్న జాతీయ రహదారి పనులను హట్యా తండావాసులు అడ్డుకొని జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను నిలుపుదల చేశారు అనేక దఫాలుగా రహదారి కాంట్రాక్టర్ కు హట్యా తండా వద్ద సర్వీస్ రోడ్డు నిర్మించాలని నిత్యం ఈ రహదారి వెంట 2000 మంది రాకపోకలు సాగిస్తుంటారు వారు కూసుమంచి వెళ్లాలన్నా లేదా జాతీయ రహదారి ఎక్కాలన్నా సుమారుగా 8 కిలోమీటర్ల వరకు చుట్టూ తిరిగి వెళ్ళవలసి వస్తుంది దీనిని అధికారులు దృష్టికి తీసుకువెళ్లిన ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. రాస్తారోకో విషయాన్ని తెలుసుకున్న జాతీయ రహదారి నిర్మాణ సంస్థ సీనియర్ మేనేజర్ ఆర్ పి సింగ్ సంఘటన స్థలానికి చేరుకొని వారి సమస్యను యాజమాన్యానికి తెలియజేస్తానని చెప్పినప్పటికీ వారు వినకుండా స్పష్టమైన హామీ వచ్చేంతవరకు రాస్తారోకో విరమించమని వారు ఆర్పి సింగ్ కి తెలియజేశారు ఈ రాస్తారోకో కు స్థానిక గ్రామ సర్పంచ్ రవి మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.