సహకార ఉద్యోగుల సమస్యలపై స్పందించాలి

వారి డిమాండ్లు న్యాయమైనవే

దీక్షా శిబిరంలో మాట్లాడిన పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ బడ్డు నాగేశ్వరరావు

విజయవాడ,ఆగస్ట్‌14( జ‌నం సాక్షి ): విజయవాడ అలంకార్‌ వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారంతో రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో విశాఖపట్టణం, తూర్పుగోదావరి, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల నుంచి 200 మంది ఉద్యోగులు పాల్గన్నారు. ఈ నిరాహార దీక్షల శిబిరానికి రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణరాజు, ప్రధాన కార్యదర్శి పి.సత్యనారాయణ, ట్రెజరర్‌ వెంకటరామయ్యలు నాయకత్వం వహించారు. మంగళవారం దీక్షలను పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ బడ్డు నాగేశ్వరరావు, ఎపి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఎంఎ/-లాయీస్‌ జెఎసి చైర్మన్‌ ఎవి.నాగేశ్వరరావులు ప్రారంభించారు. దీక్షలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ బడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఉద్యోగులు కోరుతున్న 5 డిమాండ్లు న్యాయ సమ్మతమైనవని వాటిని వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పిఎసిఎస్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 50 శాతం వేతన సవరణ చేయాలని, డిసిసిబిలలో ఉన్న ఖాళీలలో 50 శాతం సీనియార్టీ ప్రాతిపదికన పిఎసిఎస్‌ ఉద్యోగులతో భర్తీ చేయాలని కోరారు. రాబోయే కౌన్సిల్‌ సమావేశంలో పిఎసిఎస్‌ ఉద్యోగుల కోర్కెలను లేవనెత్తి వాటి పరిష్కారం కోసం కఅషి చేస్తామని హావిూ ఇచ్చారు. అనంతరం యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పి.అజయ కుమార్‌ మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 5 న ఢిల్లీలో తలపెట్టిన మహాప్రదర్శన నేపథ్యాన్ని వివరించారు. సహకార సంఘాల ఉద్యోగులు యూనియన్లతో నిమిత్తం లేకుండా ఐక్యంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. అనంతరం ఎపి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జెఎసి చైర్మన్‌ ఎవి.నాగేశ్వరరావు, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, రాష్ట్ర నాయకులు నూర్‌మహ్మద్‌లు ఉపన్యాసాలు చేశారు. ఈ దీక్షల సందర్భంగా ఎఐటియుసి కడప పిఎసిఎస్‌ ఉద్యోగుల నాయకులు దీక్షలకు మద్దతుగా ప్రసంగించారు. విశాఖపట్టణం, తూర్పుగోదావరి, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల పిఎసిఎస్‌ ఎంఎ/-లాయీస్‌ యూనియన్‌ నాయకులు ప్రసంగించారు. వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ.. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు కఅష్ణానదిలోని దుర్గాఘాట్‌ వద్ద ఉద్యోగులు జలదీక్షలు నిర్వహించారు.

 

తాజావార్తలు