సహకార ఎన్నికలకు ఏర్పాట్లు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 30 (): జిల్లాలో రెండు విడతలుగా జరిగే సహకార ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 77 సంఘాల్లో మొదటి విడతగా 38 సంఘాలకు జనవరి 31న ఎన్నికలను నిర్వహించనున్నారు. రెండో విడతగా 39 సంఘాలకు ఫిబ్రవరి 4వ తేదీన ఎన్నికలు జరపనున్నారు. ఇందుకు కాను, కొత్త ఓటర్ల సభ్యత్వ నమోదు పూర్తి కాగా, తుది జాబితా వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.