సహకార పరపతి సంఘాలకు ఎన్నికలకు

పోలింగ్‌ ముందురోజు, పోలింగ్‌ రోజు సెలవు
కరీంనగర్‌, జనవరి 28 (): జిల్లాలో సహకార పరపతి సంఘాలకు ఎన్నికలు నిర్వహించే విద్యా సంస్థంలకు పోలింగ్‌ రోజు, పోలింగ్‌ తేదీ ముందు రోజు జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి స్మితా సబర్వాల్‌ స్థానిక సెలవు ప్రకటించారు. జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే సహకార పరపతి సంఘాలకు వినియోగిస్తున్న విద్యా సంస్థలకు పోలింగ్‌రోజు ఈ నెల 31న, పోలింగ్‌ ముందురోజు ఈ నెల 30న స్థానిక సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రెండవ విడత పో లింగ్‌ నిర్వహించే విద్యాసంస్థలకు పోలింగ్‌ రోజైన ఫిబ్రవరి 4, పోలింగ్‌ ముందు రోజు ఫిబ్రవరి 3న స్థానిక సెలవు ప్రకటించారు. సహకార పరపతి సంఘాల మొదటి, రెండవ విడత ఎన్నికలకు విద్యాసంస్థల భవనాలు, ఇతర కార్యాలయాల్లో పోలీస్‌ స్టేషన్లు, రిసెప్షన్‌ కేంద్రాలు, పంపిణీ కేంద్రాలుగా వినియోగిస్తున్నందున కలెక్టర్‌కు దఖలు పరిచిన అధికారాల మేరకు విద్యాసంస్థలకు స్థానిక సెలవు ప్రకటించారు. ఒకవేళ ఏకగ్రీవంగా ఎన్నిక జరిగితే సంబంధించిన విద్యాసంస్థలు యథావిధిగా పనిచేస్తాయన్నారు.