సహజసిద్ధ వైద్యులమ్ – సమకాలిన పాలనలో పేదలమ్

నాయీ బ్రాహ్మణులు నవభారత నిర్మాణానికి పునాదులు కావాలి
– జిల్లా అధ్యక్షుడు రమేష్ నాయి

నాయీ బ్రాహ్మణుల ది గతమెంతో ఘనమైనదని, సహజసిద్ధ ప్రకృతి వైద్యులం నేడు సమకాలీన పాలకుల ఏలుబడిలో పేదల మయ్యామని వికారాబాద్ జిల్లా నాయి బ్రాహ్మణ అధ్యక్షుడు రమేష్, ఉపాధ్యక్షుడు వీరేశంలు అన్నారు. మంగళవారం వికారాబాద్ పట్టణ నాయి బ్రాహ్మణ నూతన కమిటీని నియమించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పూర్వ కాలంలో భారతదేశం నలుమూలలా మూలికావైద్యం పై ధన్వంతరి పరివార్ ఆధ్వర్యంలో కొనసాగేదని, మారిన జీవన విదాలు, పరిస్థితులకు అనుగుణంగా నవీన పోకడలు కొత్త వైద్య విధానం రావడంతో వైద్యవృత్తికి దూరమయ్యాం అన్నారు. కొందరు నాథా బృందాలుగా, కొందరు బ్యాండ్ మేళాలు, సంగీత కళా వృత్తులతోపాటు క్షుర వృత్తిని ఎంచుకుని చాల మంది కుల సభ్యులు జీవనం కొనసాగిస్తున్నామని, సమాజ సేవలో మనం భాగస్వామ్యం వెలకట్టలేనిదన్నారు. భావి భారత నిర్మాణంలో నాయీబ్రాహ్మణ సోదరులు పునాదిరాళ్ళుగా మారాలని, అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని టెక్నాలజీని పెంపొందించుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం వికారాబాద్ పట్టణ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులు ఎం శేఖర్, ప్రధాన కార్యదర్శి ఏం సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు ఏం రమేష్, కోశాధికారి ఏం సంతు, సలహాదారు కన్నయ్య లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించారు. నూతన కమిటీ నాయి బ్రాహ్మణ సంఘం కోసం సేవ చేయాలి ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా నాయి బ్రాహ్మణ సంఘానికి సేవ చేయాలి అందరినీ గౌరవించాలి అందరి చేత గౌరవించబడాలి అని కమిటీ సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ పెద్దలు శంకరయ్య, శ్రీనివాస్, కాశీనాథ్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.