సాగర్‌కు కొనసాగుతున్న వరద


18 గేట్లు ఎత్తి నీటి విడుదల
నాగార్జున సాగర్‌,ఆగస్ట్‌29 (జనంసాక్షి): నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు మరోసారి జల ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలో అధికారులు 18 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం రాత్రికి సాగర్‌ వద్ద ఇన్‌ ఎª`లో, అవుట్‌ ఎª`లో 1,94,758 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 590 అడుగులుగానే ఉంది. జలాశయ పూర్తి స్థాయి, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్‌ వద్ద విద్యుత్‌ కాంతులతో జల ప్రవాహం కనువిందు చేస్తోంది. మరోవైపు, శ్రీశైలం జలాశయంలోనూ వరద కొనసాగుతోంది. అధికారులు 6 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ ప్లో 3,11,953 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ ప్లో 1,81,008 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి, ప్రస్తుత నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి, ప్రస్తుత నీటి నిల్వ 215.8070 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్‌ వద్ద జలకళతో కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం 68,807 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.