సాగర్‌ హైవేపై విషాదం: బాలిక మృతి

రంగారెడ్డి,  జనంసాక్షి: జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలోని సాగర్‌ హైవేపై విషాద సంఘటన చోటు చేసుకుంది. బస్సు కోసం ఎదురు చూస్తున్న తల్లీకూతుళ్లపైకి డీసీఎం వ్యాను దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లి గాయపడగా నాలుగేళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. క్షతగాత్రురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నయోదు చేసుకున్న పోలీసులు డీసీఎం డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు.