సాగుచట్టాల రద్దు ప్రకటనపై సర్వత్రా హర్షం

మోడీ ప్రకటనను స్వాగతించిన విపక్షనేతలు

ముందే రద్దు చేసివుంటే బాగుండేదన్న ఖర్గేఇదో

మంచి వార్త అన్న ఢల్లీి సిఎం కేజ్రీవాల్‌

రైతుల త్యాగాలు ఫలించాయన్న సిద్దు

న్యూఢల్లీి,నవంబర్‌19(జనం సాక్షి  )

నూతన సాగుచట్టాలను కేంద్రం వెనక్కు తీసుకోవడం సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. చట్టాలను కేంద్రం రద్దు చేయడాన్నికాంగ్రెస్‌ నేత, రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున్‌ ఖర్గే స్వాగతించారు. ఇది రైతుల విజయమని ఆయన అభివర్ణించారు. సాగు చట్టాలను వెనక్కితీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేసిందని, ముందుగానే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే వందలాది రైతుల ప్రాణాలను కాపాడగలిగేవారమని వ్యాఖ్యానించారు. ప్రకాశ్‌ దివస్‌ నాడు మంచి వార్త విన్నానని ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ తెలిపారు. మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సందర్భంగా కేజీవ్రాల్‌ విూడియాతో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమంలో 700మందికి పైగా రైతులు ప్రాణత్యాగం చేశారని, వారి త్యాగాలకు ఫలితం దక్కిందన్నారు. వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం ఈ దేశ అన్నదాతలు ప్రాణాలకు తెగించి పోరాడిన తీరును భవిష్యత్తు తరాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాయన్నారు. భారత దేశ రైతులకు సెల్యూట్‌ అని కేజీవ్రాల్‌ అన్నారు. ప్రధాని మోడీ ప్రకటనపై పంజాబ్‌ పిసిసి అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు స్పందించారు. రైతుల త్యాగాలు ఫలించాయని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో ముందడుగు వేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై విజయం సాధించిన రైతులను అభినందించారు. ’నల్ల చట్టాలను రద్దు చేయడం సరైన దిశలో ఒక అడుగు. కిసాన్‌ మోర్చా చేస్తున్న సత్యాగ్రహం చారిత్రక విజయం సాధించింది. విూ త్యాగం డివిడెండ్‌లును చెల్లించింది. రోడ్డు మ్యాప్‌ ద్వారా పంజాబ్‌లో వ్యవసాయాన్ని పునరుద్ధరించడం.. పంజాబ్‌ ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉండాలని’ సిద్ధూ ట్వీట్‌ చేశారు.్గªళింద్ర ప్రభుత్వం మూడు వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలంటూ గత ఏడాది నవంబర్‌ 26 నుండి ఢల్లీి సరిహద్దుల్లో ఉద్యమం సాగిస్తున్నారు. దాదాపు ఏడాదిగా సాగుతున్న ఈ పోరాటానికి కేంద్రం దిగి రాక తప్పలేదు.`