సాధారణ సర్వసభ్య సమావేశం.. హాజరైన నర్సాపుర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి.

మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రోజున ఎంపీపీ రాజు నాయక్ అధ్యక్షతన సాధన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి చేరువయ్యలా చూడడం జరుగుతుందని, కళ్యాణ్ లక్ష్మి,షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ లాంటి నిరంతరాయ పథకాలను ప్రవేశపెట్టి భారత దేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందని ఆయన అన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒకానొక దశలో బాగా లేనప్పటికీ సంక్షేమ పథకాలను ఎక్కడ కూడా ఆపకుండా ముందుకు తీసుకెళ్లడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. అనంతరం ఆయా శాఖల అధికారుల యొక్క పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కవిత అమర్ సింగ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, ఎంపిటిసి ల ఫోరం అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, కోఆప్షన్ నెంబర్ మహమ్మద్ అహ్మద్, వైస్ ఎంపీపీ నవీన్ కుమార్ గుప్తా ఎంపీడీవో భారతి, తాహసిల్దార్ కమలాద్రి, డాక్టర్ వెంకట్ యాదవ్ తోపాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.