సానియాకు కెరీర్ బెస్ట్ ర్యాంకు

u9brwmqg
 న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కెరీర్ లో బెస్ట్ ర్యాంకు సాధించింది. మహిళల డబుల్స్ విభాగంలో మూడో ర్యాంకుకు చేరుకుంది. 6885 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచింది. తాజాగా మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్‌లో సానియా డబుల్స్ టైటిల్‌ను గెల్చుకుంది. ఈ విజయంతో 1000 పాయింట్లు సంపాదించి డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్ లో రెండు స్థానాలు మెరుగుపరుచుకుంది.కెరీస్ బెస్ట్ ర్యాంకు సాధించడం థ్రిల్లింగ్ గా ఉందని సానియా మీర్జా సంతోషం వ్యక్తం చేసింది. నంబర్ వన్ గా నిలవాలన్నది తన స్వప్నమని, ఏదో ఒకరోజు టాప్ చేరుకుంటానని పీటీఐతో చెప్పింది. ప్రస్తుతం సానియా అమెరికాలో ఉంది.