సానియా మీర్జా సంతోషం: డ్యాన్స్ చేశా.. భర్త మాలిక్ సమాధానాలు ఇలా
హైదరాబాద్: ప్రపంచ నెంబర్ వన్ స్థానం దక్కించుకున్న సానియా మీర్జా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఫెడ్ కప్‌లో భారత జట్టుకు సానియా సారథిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నెంబర్ వన్‌గా నిలవడం ఆనందంగా ఉందని చెప్పారు. తన కల నెరవేరినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. కాగా, సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ ట్విట్టర్‌లో పలువురు అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే.
ప్రశ్నలకు సమాధానాలు చెప్పారిలా…
– సానియా నెంబర్ వన్ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు?
చాలా సంతోషంగా ఉంది. ఇంత సంతోషం మొదటిసారి.
– సానియా విజయాన్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు?
తాను సానియాతో లేను. కాబట్టి ఫోన్ చేశాను. ఆనందంతో చిందేశాను. సానియా మీర్జా సంతోషం: డ్యాన్స్ చేశా.. భర్త మాలిక్ సమాధానాలు ఇలా – జూనియర్ మాలిక్ ఎప్పుడొస్తున్నాడు?
త్వరలో
– కొడుకు పుడితే ఏం పేరు పెడతారు, అతనిని క్రికెటర్ చేస్తారా.. లేక టెన్నిస్ ప్లేయర్ చేస్తారా?
ఇది క్లిష్టమైన ప్రశ్న. రెండు కావొచ్చు. మీరేమనుకుంటున్నారు..
– అమ్మాయి పుడితే ఏం పేరు పెడతారు?
ఏమీ అనుకోలేదు.
మిరియల్లా లేదా రీమ్ – సానియా బాబీ, మీ అమ్మ ఎలా ఉన్నారు?
బాగున్నారు.
అమ్మతో ఉన్నాను. సానియాను మిస్సవుతున్నా
– పాకిస్తాన్ తరఫున ఆడమని సానియాను అడుగుతారా?
అది సరికాదు. ఆమెను ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పను. అది ఆమె ఇష్టం.
– భారత్‌లో నీకు ఇష్టమైన నగరం?
హైదరాబాద్ – పెళ్లి తర్వాత మీ ప్రదర్శన డౌన్, సానియా ప్రదర్శన పెరిగింది?
దీనిని అంగీకరించను
– సానియా నుండి ఏం నేర్చుకున్నారు?
చాలా నేర్చుకున్నా.
– మీరు క్రికెటర్ అయి ఉండకపోయి ఉంటే..?
సానియా మేనేజర్.
– మీ కంటే మీ భార్య సానియా ఫేమస్ పర్సన్.. దీని ప్రభావం మీ బంధంపై ఉంటుందా?
నేను ఆమె బాగు కోసం ప్రార్థిస్తాను. ఆమె విజయాల పట్ల గర్విస్తున్నా.
– పాకిస్తాన్‌లో మీ ఇద్దర్ని ఎప్పుడు చూడొచ్చు?
ఈద్ తర్వాత కావొచ్చు. ఆమె ఓపెన్స్, నా లీగ్స్ ఉన్నాయి.
– సానియా సినిమాల్లో నటించాలనుకుంటే అంగీకరిస్తారా?
ఆమెను అంగీకరించాను.
– సానియాతో ఎప్పుడైన క్రికెట్ లేదా టెన్నిస్ ఆడారా?
ఆడాం.
ఇరువురం పరస్పరం సూచనలిచ్చుకున్నాం.
– హైదరాబాద్ ఎప్పుడొస్తారు?
త్వరలో.
అయితే, ఇది పర్సనల్ ట్రిప్. దానిపై ఇప్పుడే చెప్పను. మీరు పిక్స్ చూడొచ్చు
– ఎప్పుడైనా మీరిద్దరు గొడవపడ్డారా?
అవును. అయితే, సానియా ప్రారంభిస్తే… నేను పూర్తి చేస్తాను.
– పాకిస్తాన్ ప్లేయర్, సానియా ఆడితే ఎవరికి మద్దతు?
ఆటగాడిగా భార్యకు, వ్యక్తిగా పాకిస్తాన్‌కు.
– టీవీ రిమోట్ ఎవరి చేతిలో ఉంటుంది? సానియా చేతిలో.
– టీనేజ్‌లో ఎవరినైనా ప్రేమించారు?
అవును.