సామూహిక పూజలు మంచి సత్ఫలితాలు ఇస్తాయి


– పేరపల్లిలో బొడ్రాయి ప్రతిష్టాపన, పోచమ్మ కొలుపు లో పాల్గొన్న జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ జనం సాక్షి, కమాన్ పూర్ : మన పూర్వీకులు పాటించిన ఆచారాలు ఆధ్యాత్మికత పెంపుకు తోడ్పాటునందిస్తాయని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. కమాన్‌పూర్‌ మండలం పేరపల్లి గ్రామంలో శ్రీలక్ష్మి, భూలక్ష్మి సహిత బొడ్రాయి ప్రతిష్టాపన, పోచమ్మ కొలుపు కార్యక్రమంలో ఆయన పాల్గొని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ.. అనేక పరిస్థితుల కారణంగా విడిపోయిన బంధుత్వాలు మళ్లీ కలిసేలా పురాతణ ఆచారాలు ఎంతో ఉపయోగపడుతాయని అన్నాయి. గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఎక్కడడెక్కడో ఉండే ఆ ఊరి వాళ్లు ఒక్కచోటికి చేరుతారని, ఒక కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరు సంతోషంగా గడుపుతారని ఆయన తెలిపారు. పురాతణ సంప్రదాయాలు బంధుత్వాల కలయిక కోసమే ఆనాడు మన పూర్వీకులు ముందు చూపుతో పెట్టారని ఆయన అన్నారు. గ్రామస్తులంతా ఒక్కచోటికి చేరి ఐక్యంగా సామూహికంగా చేసే పూజలు ఎంతో సత్పలితాలు ఇస్తాయన్నారు. గ్రామంలో ప్రతి కుటుంబానికి చెందిన వారంతా ఊరికి రావడంతో ఆ గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడుతుందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు బొడ్రాయి, భూలక్ష్మి తదితర గ్రామదేవతల విగ్రహాలు కర్రతోనే ప్రతిష్టించేవారని, కానీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రామదేవతల విగ్రహాలను మంచి రాతితో నెలకొల్పుతున్నారని ఆయన అన్నారు. ఇలాంటి ఆద్యాత్మిక కార్యక్రమాల్లో తాను పాల్గొనడం అదృష్టంగా బావిస్తున్నట్లు చెప్పారు.