సామ్రాజ్య వాదం ఎదురు దాడి, ఛావెజ్ సజీవ శక్తి, కొనసాగుతున్న పోరాటం
జేమ్స్ కాక్‌క్రాఫ్ట్ర్(స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ ఫ్రొఫెసర్)
యుగం మార్పు:ఈ క్వెడార్ అద్యక్షుడు రాఫిల్ కొరియో పరిశీలన గమనార్హమైనది. మార్పు యెగంలో జీవించటం కాదు, యుగం మార్పులో జీవిస్తున్నాం. గమనించవలసింది ఏమంటే, సామ్రాజ్యవాదం ప్రపంచ వ్యప్తంగా క్షీణిస్తున్నది, చారిత్రక మార్పులోస్తున్నాయి. సామాజీక సంబంధాలలో, వర్గ సంబంధాలలో, దేశాల స్థితిగతుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. సమాజంలో క్రింది వారి నుండి ప్రజా ఉద్యమాలు తలెత్తుతున్నాయి. దాని గొంతుక హూగో ఛావెజ్. అమెరికా సైనిక, దౌత్య పరాజయాలు ప్రపంచమంతటా చుస్తూన్నాం. గ్లోబల్ ద్రవ్యం సంక్షోభం అనుభవిస్తున్నాం. అమెరికా ఫ్రపంచ ఆధిపత్యనికి కూడా ఇది వర్తిస్తూంది.బహుళ అధికార కేంద్రాలు ఫ్రపంచంలో తలెత్తాయి. నూతన ఆర్థిక పొత్తులు,భౌగోళిక రాజకీయ పొత్తులు ఏర్పడ్డాయి. భ్రిక్స్ ఆర్థిక శక్తి పెరుగుతున్నది. దానిలో సభ్య దేశాలు బ్రెజిల్, రష్యా,చైనా,ఇండియా, దక్షిణాఫ్రికా.లాటిన్ అమెరికాలో సెలాక్ బలపడుతున్నాది. సామ్రాజ్యవాద ఫ్రభుత్వాలు ఎదురుదాడితో సాముజిక ఉద్యమాలను అణచటానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రపంచ వనరులపై నియంత్రణకు యుద్దాలు సాగిస్తున్నాయి. ప్రపంచాన్ని మిలట్రి మయం చేస్తున్నాయి. అధ్యక్షుడు చావెజ్ వెనిజులాలో పెట్రోలియం పరశ్రమలను జాతీయం చేసి ఆ వచ్చిన ఆదాయంతో శ్రమ జీవుల ప్రయోజనాలకు ఉపయెగించారు. 21వ శతాబ్దం సోషలిజం లక్ష్యంగా లాటిన్ అమెరికా ప్రజల ఐక్యతను, దేశాల ఐక్యతను, ప్రత్యామ్నాయ విధానాలను కాంక్షించాడు. బొలివారియన్ సోషలిస్ట్ ప్రణాళికలో ఐదంశాలు వున్నాయి. మరో ప్రత్యామ్నాయ ప్రపంచం కొరకు ముందుకు సాగారు. 1994లో మెక్సికోలో జపాటిస్టా తిరుగుబాటు జరిగింది. 1995లో హూగో ఛావెజ్ అద్యక్షుడుగా ఎన్నికయ్యారు. 2001లో కెనడాలో ప్రజాశిఖరాగ్ర సమావేశం జరిగింది. సమూల మార్పులకు ఇవి దోహదం చేశాయి. దీని మూలాలు 1959క్యూబన్ విప్లవంలో ఉన్నాయి. లాటిన్ అమెరికాలో కొత్త కరెన్సీని ప్రవేశపెట్టారు. లాటిన్ అమెరికా రక్షణ మండలి కొత్తగా ఏర్పడింది. ప్రత్యామ్నాయ రేడియో, టెలివిజన్ ఛానళ్లు, ప్రసార మాద్యమాలు ప్రారంభమయ్యాయి. సెలాక్ ఆల్బా ఏర్పడ్డాయి. ఈ విప్లవ క్రమంలో ప్రవేశపెట్టిన నూతన నంన్కరణలు సత్పలితాలను యిచ్చాయి. కొన్ని పొరపాట్లుజరిగాయి. కాపిటలిజం విభిన్న రూపాలలో కొనసాగుతూనే వున్నది. యుగ మార్పుకు యివి సూచనలు.
న స్వతంత్ర రాజ్యాల కొత్త రూపాలు, బహుళ సంస్కృతులు రాజ్యాలు
న ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం నూతన రూపాలు, శాసనసభల్లో, రాజ్యాంగ రూపకల్పనలో
న విదేశీ సైనిక స్థావరాల నిషేదం
న భూసంస్కరణలు, రైతాంగ ఉద్యమాల ప్రపంచ సమాఖ్య
న తాగునీటి సమస్య ఒక మానవ హక్కు
న మూలవాసుల హక్కులు, మహిళల హక్కులు
న భూమాతను రక్షించటం
న ప్రసారమాద్యమాల హక్కులు
న ఇందనం అ భివృద్ది
న దారిద్యం, నిరక్షరాస్యత నిర్మూలన
న సామ్రాజ్యవాదం, వలసవాదం, యుద్దాలు తిరస్కరణ
న స్వాతంత్య్రం, స్వేచ్చ, సంఘీభావం
సామ్రాజ్యవాదం ఎదురుదాడిలో భాగంగా సైనిక శక్తిని ఉపయోగిస్తుంది. సైబర్‌నెటిక్ యుదాన్ని కొనసాగిస్తున్నది.
ప్రసారమాధ్యమాలపై ఆధిపత్యాన్నిచెలాయిస్తున్నది. ప్రత్యర్థులను నేరస్థులుగా నిండా ప్రచారంచేస్తున్నది. అమెరికాకు కెనడా ప్రభుత్వం తోడైంది.మెక్సికో, కొలంబియా, పెరూ,చిలీ, హూండూరస్, గౌతమాలా, కోస్టరికా, పనామా దేశాలతో పసిఫిక్ కూటమి ఏర్పడింది. సామ్రాజ్యవాదుల ఎదురుదాడిని ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. మహిళలు ప్రజాశిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించారు. వీరి ఆలోచనల్లో రాడికల్ మార్పులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ సోషలిస్టు భావాలు కనిపిస్తున్నాయి. సామాజిక అభివృద్దికి, సాధికారతకు అనేక దేశాలలో ఉద్యమాలు పెరుగుతున్నాయి. వీటన్నింటికి ఛావెజ్ ఒక ఉదాహరణ. క్యూబా మినహయిస్తే ఈ దేశాలలో కాపిటలిస్టు ఆర్థిక వ్యవస్థ కొనసాగుతోంది. ఈ అన్ని దేశాలలోనూ అంతర్గత సంఘర్షణలు వున్నాయి. కొన్ని సరిహద్దు సంఘర్షణలు ఉన్నాయి. విప్లవ క్రమంలో అంతర్గత సమస్యలు ఉన్నాయి. ఆత్మవిమర్శ, సృజనాత్మక, విమర్శనాత్మక ఆలోచనల ద్వారా వీటిని పరిష్కరించేందుకు ఛావెజ్ ప్రయత్నించాడు. లాటిన్ అమోరికా ప్రజలు ఎంచుకున్న మార్గంలో ముందుకు సాగుతారని ఆశిస్తున్నారు. కాపిటలిస్టు వ్యతిరేక, పిత్యస్వామిక వ్యవస్థ వ్యతిరేక, జాతి వివక్ష వ్యతిరేక కార్యక్రమంతో మానవీయ అంతర్జాతీయ వ్యవస్థ నిర్మాణం కొరకు కృషి చేయటమే బొలివార్ విప్లవ లక్ష్యం. 21 శతాబ్దంలో నూతన ఆవష్కరణలకు ఈ మార్గాన్ని ఛావెజ్ ఎంచుకున్నారు.