సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపణ మహోత్సవ లో పాల్గొన్న : ఉప్పల శ్రీనివాస్ గుప్త
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దేశ్ ముఖీ గ్రామంలో సాయి బృందావనం అష్ఠబుజి దేవాలయంలో సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సాయిబాబాకి, హోమం కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ… కేసీఆర్ సీఎం అయిన తర్వాత దేవాలయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాడు. దేవాలయాలకు అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని అన్నారు.
అంతకు ముందున్న ప్రభుత్వాలు దేవాలయాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తూ, ధూపదీప నైవేద్యాలకు, పూజారులకు జీతాలు ఇస్తున్న ఘనత కేసీఆర్ గారిదే అని అన్నారు. తెలంగాణలో ఉన్న వేములవాడ, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి, రామప్ప, గోల్కొండ బోనాలు, బిర్లా మందిర్, వేయి స్తంభాల దేవాలయం, తదితర దేవాలయాల అభివృద్ధికి అనేకమైన కృషి చేస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ ఘంటా నారాయణ స్వామిజీ, పాపారావు దంపతులు, భక్తులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.