సారిక, పిల్లలకు కన్నీటి వీడ్కోలు

4

వరంగల్‌, నవంబర్‌ 5 (జనంసాక్షి):

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ ఎంపి రాజయ్య ఇంట్లో  సజీవదహనమైన సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతదేహాలకు వరంగల్‌ మార్చురీలో తీవ్ర ఉత్కంఠ నడుమ పోస్టుమార్డం పూర్తైంది. మార్చురీ సవిూపంలోని పోతన స్మశాన వాటికలో మృతదేహాలకు అత్యక్రియలు నిర్వహించారు. ఇక రెండు రోజులుగా  రాజయ్య, అయన భార్య మాధవి, కుమారుడు అనిల్‌ పోలీస్‌ కస్టడీలో ఉన్నారు.  సారిక, మనువలు అభినవ్‌, శ్రీయాన్‌, అయాన్‌ మృతదేహాలకు వరంగల్‌ ఎంజీఎం మార్చురీ పోస్టుమార్టం నిర్వహించారు. ఉత్కంఠ మధ్య మద్యహ్నం ఒంటిగంట తర్వాత హైదరబాద్‌ నుండి వచ్చిన డాక్టర్‌ శ్రీరాం బృందం నేతృత్వంలో మృతదేహాలకు పోస్టుమార్డం మూడు గంటలకు పూర్తయ్యింది. పోస్టుమార్టం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక ఏసీపీ ఆద్వర్యంలో పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు.  పోస్టుమార్టం పూర్తయ్యాక అత్యక్రియల నిర్వహన విషయమై మృతదేహాలను గంట సేపు మార్చురీలోనే భద్రపరరిచారు. అనంతరం మార్చూరీ సవిూపంలోని పోతన స్మశాన వాటికలో ప్రజాసంఘాలు, విశ్వబ్రహ్మణ సంఘం ఆద్యర్యంలో అత్యక్రియలు నిర్వహించారు. సారిక చితికి అమె తల్లి లలితాదేవి నిప్పంటించగా ముగ్గురు పిల్లలను ఖననం చేశారు.     అయితే మార్చురీ వద్దకు, అంత్యక్రియలకు రాజయ్య బంధువులు రాలేదు. ఇక రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్‌  రెండు రోజులుగా పోలీస్‌ కస్టడీలోనే ఉన్నారు. నగరశివారులోని మామూనూరు పోలీస్‌ స్టేషన్‌ లో వీరిని విచారిస్తున్నారు.  సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల మృతి కేసు విచారణను శాస్త్రీయంగా చేస్తున్నామని ఏసీపీ శోభన్‌ కుమార్‌ తెలిపారు. ఈ కేసులో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) రిపోర్టే కీలకంగా మారనుందని అన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు ఆస్కారం లేదన్నారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కేసును విశ్లేషిస్తుందని… ఈ నివేదికను బట్టే హత్యా లేదా ఆత్మహత్యా అనే దానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందన్నారు. ప్రస్తుతం రాజయ్య కుటుంబసభ్యులు పోలీసులు అదుపులో ఉన్నారు. కేసు నమోదు చేశామని.. విచారణ తర్వాతే ఏం జరిగిందనేది తెలుస్తుందని ఏసీపీ తెలిపారు.