సింగరేణి ఎన్నికలు ఇక వాయిదానే?

సింగరేణి లో యూనియన్ ఎన్నికల మీద ఈనెల 27 న డిప్యూటీ సీఎల్సీ కార్యాలయంలో 14 యూనియన్లు, సింగరేణి యాజమాన్యం చర్చలు జరుగనున్నాయి. సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని హై కోర్ట్ లో వేసిన పీటిషన్ లో విజ్ఞప్తి ని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 27 న ఎన్నికల నోటిఫికేషన్ ను డిప్యూటీ సిఎల్సి శ్రీనివాసులు ఇవ్వాల్సి ఉంది. అయితే సింగరేణి లో 14 యూనియన్లకు గాను అందరిని సమానంగా ట్రీట్ చేయడానికి యాజమాన్యం అంగీకరించిన నేపథ్యంలో మెజారిటీ యూనియన్లు ఎన్నికల కు వెళ్లడం ఎందుకు? అనే విధంగా ఉన్నాయి. మేనేజ్మెంట్ కు అప్పీల్ కు వెళ్లకుండానే, తన కోరిక ఈ విధంగా నెరవేరే పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని మెజారిటీ యూనియన్స్ భావిస్తున్నాయి. వారు బుధవారం సంయుక్తంగా సంతకాలు చేసి డిప్యూటీ సిఎల్సి కి ఇచ్చే పరిస్థితి ఉంది. అన్ని యూనియన్లకు ప్రోటోకాల్ సమానంగా ఇస్తున్నపుడు, సింగరేణి లో ఎన్నికలు ఎందుకు?ఇదే మరి, సింగరేణి యూనియన్ లకు ప్రోటోకాల్ యావ! అట్లనే ఉంటది! కార్మికుల సమస్యల మీద కల్సి 14 యూనియన్లు పరిష్కారానికి కృషి చేయాలి. గుర్తింపు తో ఎలాంటి సంబంధం లేకుండా అందరికి సమాన హోదా రానే వచ్చినంక ఇంకేమి కావాలి!ఇంకోటి కూడా వాయిదా కోరడానికి కారణం కనిపిస్తుంది. అది ఏమిటంటే, అసెంబ్లీ ఎన్నికలకు ముందు సింగరేణి ఎన్నికలు జరగడం వల్ల సింగరేణి అంతా రాజకీయం అయిపోతుంది. భారీగా గతంలో మాదిరి డబ్బుల ఖర్చు, అంతా వాతావరణం అస్తవ్యస్తం గా మారుతుంది. ఇవన్నీ భరించే పరిస్థితి ఎవరికి ఉండదు. అందుకు కూడా సింగరేణి యూనియన్ ఎన్నికలు వాయిదా కోరుతున్నారని తెలుస్తున్నది!————–(ప్రత్యేక ప్రతినిధి/జనం సాక్షి )