సింగరేణి ఒసిపి-2 పనులు పూర్తి చేయాలికలెక్టర్ స్మితా సబర్వాల్
కరీంనగర్, జనవరి 30 (): సింగరేణి ఒసిపి-2 భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ అన్నారు. బుధవారం కలెక్టకేట్‌లోని వారి ఛాంబర్లఓ సింగరేణి భూసేకరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి ఓపెన్ కాస్టు ప్రాజెక్టు-2 విస్తరణకు సంబంధించి ఇంతవరకు లద్నాపూర్‌లో 302 ఎకరాల భూమి సేకరణ చేయాలని అన్నారు. సేకరించిన భూములకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. మంగళపల్లిలో గల కట్టడాలకు చెల్లింపులు చేయాలని అన్నారు. ఇండ్లు కోల్పోయిన వారికి త్వరగా నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అటవీ ప్రాంతాలలోని వన్య ప్రాణులకు హాని కలగకుండా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ హెచ్. అరుణ్‌కుమార్, డివిజనల్ పారెస్టు అధికారి షపియుల్లా తదితరులు పాల్గొన్నారు.