సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై సమరం.

జులై ఒకటో తారీకు నుండి
      ముమ్మర తనిఖీలు
 దుకాణాదారులు వస్త్ర సంచులను ప్రోత్సహించాలి.
మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య.
కమిషనర్ గుండె బాబు.
 తొర్రూర్ 30 జూన్ (జనంసాక్షి )ప్లాస్టిక్ పై సమరం సాగించాలని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య కమిషనర్ గుండె బాబు అన్నారు. గురువారం ప్లాస్టిక్ పై అవగాహన ర్యాలీ కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జులై ఒకటో తారీకు నుండి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వస్తువులు ఉత్పత్తులపై కేంద్రం నిషేధించిన విషయం తెలిసిందే భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం 120  మైక్రాన్స్ కన్న తక్కువ మందంగల ప్లాస్టిక్ కవర్లు బ్యాగులు గ్లాసులు ప్లేట్లు. ఇయర్ బర్డ్స్. వాడిన నిలువచేసిన దిగుమతి చేసుకున్న.పంపిణీ చేసిన రూపాయలు వెయ్యి నుండి 25 వేల రూపాయల వరకు జరిమానాలు విధించి వారి షాపు లైసెన్సులు రద్దు చేయబడతాయని అన్నారు. రేపటి నుండి ముమ్మరంగా తనిఖీలు చేపట్టనున్నామని. ప్లాస్టిక్ రహిత సమాజం గా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని దీనికి ప్రతి ఒక్కరు పట్టణ అభివృద్ధికి సహకరించాలని సూచించారు. దుకాణ యజమానులు తడి పొడి చెత్తను వేరు చేసి తమ సొంత డబ్బాలను దుకాణం ముందు ఏర్పాటు చేసుకోవాలన్నారు. షాపునకు వచ్చే మున్సిపల్ వాహనాలకు అందజేయాలని ఈ నియమాలను ఉల్లంఘించిన వారికి రూపాయలు వెయ్యి నుండి పదివేల రూపాయల వరకు జరిమానా విధించబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జినుగా సురేందర్ రెడ్డి. కౌన్సిలర్లు.  గజానందు. కొలువుల శంకర్. నాయకులు జై సింగ్ నాయక్. జంప. హెల్త్ అసిస్టెంట్ రాజు. జూనియర్ అసిస్టెంట్ నవీన్. జవాన్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.