సింధూ, సాక్షి, దీపకు వజ్ర హారాలు

24brk-nuckles1aaచెన్నై: రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు ప్రోత్సాహకాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా చెన్నైకి చెందిన ఓ జ్యూవెలరీ సంస్థ వీరికి డైమండ్‌ నెక్లెస్‌లను ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

చెన్నైకి చెందిన ఎన్‌ఏసీ జ్యువెలరీ సంస్థ భారత్‌కు ఒలింపిక్‌ పతకాలు సాధించి పెట్టిన పీవీ సింధు, సాక్షి మాలిక్‌లతో పాటు రియోలో అద్భుత ప్రదర్శన కనబర్చి తృటిలో పతకాన్ని చేజార్చుకున్న దీపా కర్మాకర్‌కు డైమండ్‌ నెక్లెస్‌లను అందంచనున్నట్లు పేర్కొంది.

రియోలో రజత పతక విజేత పీవీ సింధూకు రూ.6లక్షలు విలువ చేసే హారం ఇవ్వనుంది. అలాగే సాక్షి మలిక్‌కు రూ.3లక్షలు, దీపా కర్మాకర్‌కు రూ. లక్ష విలువచేసే హారాలను అందజేయనున్నట్లు ఎన్‌ఏసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనంత పద్మనాభన్‌ తెలిపారు.