సిఎం పర్యటనను పురస్కరించుకుని క్షేత్రస్థాయిలోపర్యటించిన కలెక్టర్ నిఖిల
వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి , ఆగస్టు 11
వికారాబాద్ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటనలో భాగంగా జిల్లాలో చేపడుతున్న పనులను జిల్లా కలెక్టర్ నిఖిల క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో చేపట్టిన సుందరీకరణ పనులను, ఎన్నెపల్లి నుండి కలెక్టర్ కార్యాలయ మార్గంలో ప్రధాన రహదారుల వెంబడి అవెన్యూ ప్లాంటేషన్, రహదారుల పరిశుభ్రత పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. అలాగే ప్రధాన రహదారులపై ఉన్న గుంతలు, మారమ్మత్తు పనులు చేపట్టాలని ఆర్అండ్బి అధికారులను ఆదేశించారు. పనులను వేగవంతం చేసి అన్ని పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ ఏర్పాటు కొరకు జిల్లా ఎస్పి కోటిరెడ్డితో కలిసి పోలీస్ గ్రౌండ్ను పరిశీలించారు. కలెక్టర్తో పాటు ఆర్అండ్బి ఇ ఇ లాల్ సింగ్, డిఇ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.