సిఎల్‌పీ విలీనంతో రాజకీయ అప్రతిష్ట
విపక్షాన్ని దెబ్బతీయడం కర్రపెత్తనమే
తక్షణంగా టిఆర్‌ఎస్‌కు వచ్చే లాభమేవిూ లేదు
స్పీకర్, సిఎం కెసిఆర్‌లకు మచ్చగా నిలిచే చర్య
హైదరాబాద్,జూన్7(జనంసాక్షి): ఇప్పటికప్పుడు కాంగ్రెస్ విపక్షంగా ఉండకూడదన్న ఆలోచన కెసిఆర్‌కు రావడం రాజకీయంగా సరైన నిర్ణయం కాదు. వారేవిూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా అమాంతంగా కెసిఆర్‌పై ప్రమతో కెసిఆర్ పంచన చేరలేదు. అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ది చేసుకోగలమన్న ఎమ్మెల్యేల వాదనలో కూడా నిజం లేదు. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా నిధుల కేటాయింపుల్లో వివక్ష లేదని కెసిఆర్ కూడా తరచూ చెబుతూనే ఉన్నారు. అయినా ఇలాంటి చర్యల ద్వారా తాత్కాలికంగా కెసార్ ఏదైనా లాభం పొందాలని చూసినా ప్రజల్లో మాత్రం ఉన్న ప్రతిష్టను మంటగలుపుకోవడం తప్ప మరోటి కాదు. 88 సీట్లు ఉండగా మరో 12మంది కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వారికివారుగా వచ్చినా తిరస్కరించివుంటే కెసిఆర్ ప్రతిష్ట పెరిగేది. ప్రస్తు విలీనం ప్రక్రియ వల్ల అటు స్పీకర్ ప్రతిష్ట, ఇటు టిఆర్‌ఎస్ ప్రతిష్టలకు భంగం వాటిల్లిందనే చెప్పాలి. కాంగ్రెస్ విూద కసి తీర్చుకునే క్రమంలో రాజకీయంగా చేస్తున్న విన్యాసాలే తప్ప మరోటి కాదు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు.. కాంగ్రెస్ ప్రతిపక్ష ¬దాను సైతం కోల్పోవడానికి అనేక కారణాలున్నాయి. గత డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వంలో లోపం స్పష్టంగా కనిపించింది. టికెట్ల కేటాయింపులు, పొత్తులు, ప్రచార వ్యూహం లేక ఎన్నికల్లో బొక్కాబోర్లా పడింది. ఓటమితో నైరాశ్యంలో ఉన్న కేడర్‌లో నైతిక స్థైర్యం నింపే చర్యలేవీ టీపీసీసీ చేపట్టలేదు. ఓటమికి కారణాలేమిటో అధ్యయనం చేయలేదు. ఇక పార్టీ మనుగడ కష్టమన్న అభిప్రాయంతో ఉన్న నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో
కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్‌కుమార్ పార్టీ మారారు. ఎమ్మెస్ ప్రభాకర్‌రావు, దామో దర్‌రెడ్డిలతో కలిసి శాసనమండలి పక్షాన్ని విలీనం చేయాలని మండలి చైర్మన్‌ను కలిసే వరకూ టీపీసీసీ పసిగట్టలేకపోయింది. దీనిపై తేరుకుని విలీనంపై ప్రజాక్షేత్రంలో పోరాడే సమయానికే కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు ప్రకటన వచ్చేసింది. దీంతో మండలిలో షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాత్రమే మిగలారు. వారి పదవీ కాలం కూడా ముగిసింది. అనంతరం జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి గెలుపుతో ప్రస్తుతం మండలిలో ఒక్క సభ్యుడే కాంగ్రెస్‌కు మిగిలారు. ఇక మండలిలో వ్యూహాన్నే శాసనసభలోనూ టీఆర్‌ఎస్ అమలు చేస్తుందని తెలిసినప్పటికీ, పార్టీ నాయకత్వం తగిన విధంగా వ్యవహరించడంలో విఫలమైంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌లోని మొత్తం 19 మంది ఎమ్మెల్యేల్లో టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. తాజాగా శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కూడా ఈ జాబితాలో చేరడంతో మొత్తం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరినట్లయింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లగొండ నుంచి ఎంపీగా గెలుపొందడంతో ఆయన హుజూర్‌నగర్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. వారిలో భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క, పోడెం వీరయ్య ఉన్నారు. ఒకట్రెండు రోజుల్లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి ఝలక్ ఇచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదని గాంధీభవన్ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ పార్టీ మారి విలీన పక్రియకు పూనుకున్నా, అప్పట్లోనే పీసీసీ నేతలు దాన్ని పలు వేదికలపై ప్రశ్నించినా, కోర్టులో సవాల్ చేయలేదు. ఇక ఆత్రం సక్కు, రేగ కాంతారావు పార్టీ మారిన సమయంలో కేవలం అసెంబ్లీ ముందు నిరసనలకు దిగడం తప్ప న్యాయపరమైన పక్రియను ప్రారంభించడంలో జాప్యం చేసింది. చివరి నిమిషంలో హైకోర్టును ఆశ్రయించినా, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు మొత్తానికే ఎసరు రావడంతో మళ్లీ కోర్టులను ఆశ్రయిస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. మరి ఇది ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులం కావడంతో పాటు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే తెరాసలో చేరుతున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు చెప్పడం ప్రజలను వంచించడం తప్ప మరోటి కాదు. తెరాస ఎల్పీలో సీఎల్పీ విలీనం కోసం పక్కా వ్యూహంతో తెరాస సన్నద్ధమైంది. రెండు నెలల క్రితం దీనికి సంబంధించిన కార్యాచరణ మొదలైంది. విలీనం పూర్తికావడంతో కాంగ్రెస్ శాసనసభలో విపక్ష¬దా కోల్పోయింది. విలీనం కోరుతూ తీర్మానం చేసి లేఖ ఇచ్చిన 12 మంది కాంగ్రెస్ సభ్యులు ఇకపై తెరాస సభ్యులేనని తెలంగాణ శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు తమ ఉత్తర్వులో పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు చెందిన 12 మంది సభ్యులు సీఎల్పీని తెరాసలో విలీనం చేయాలంటూ శాసనసభాపతికి లేఖను సమర్పించారని కార్యదర్శి పేర్కొన్నారు.