సిఐటియులో 30 మంది ట్రాక్టర్ డ్రైవర్లు చేరిక
హుజూర్ నగర్ సెప్టెంబర్ 12 (జనం సాక్షి): మండలంలోని అమరవరం గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్లు 30 మంది సిఐటియులో చేరారని జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు అన్నారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు కార్మికుల పక్షాన కార్మికుల హక్కులకై అనేక పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. డ్రైవర్లకు ఉద్యోగ భద్రత, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి వేతనాలను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. గ్రామాలలో ట్రాక్టర్ డ్రైవర్లుగా వెట్టిచాకిరి చేస్తున్న వారికి సరైన న్యాయం జరగలేదని వారన్నారు. డ్రైవర్లకు సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ఇల్లు, ఇల్ల స్థలాలు, డబల్ బెడ్ రూమ్, రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. అనంతరం నూతన కమిటీ ఎన్నికలో గౌరవ అధ్యక్షులు పోసనబోయిన హుస్సేన్, సిఐటియు నాయకులు శ్రీలం. శీను, అధ్యక్షులుగా కోలపూడి. దేవ స్వామి, కార్యదర్శిగా షేక్ .సైదా, ఉపాధ్యక్షులుగా ఇరుకు రమేష్, సహాయ కార్యదర్శిగా పోలే శీను, కోశాధికారిగా తుపాకుల మంగయ్య, కమిటీ సభ్యులు పోసనబోయిన బాలయ్య, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.