సిడ్నీ స్టేడియంలో అభిమానుల సందడి

సిడ్నీ,మార్చి26 (జ‌నంసాక్షి) : భారత్‌, ఆసీస్‌ సెవిూఫైనల్‌కు అభిమానులు పోటెత్తుతారని ముందు నుంచి అనుకున్నదే. అందుకు తగ్గట్లే భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు.  స్టేడియంలో 70 శాతం టిక్కెట్లు అభిమానులే కొన్నట్లు వార్తలు వచ్చాయి. గురువారం స్టేడియంలో చూస్తే 85 శాతం వరకు భారత అభిమానులే కనిపించారు. స్టేడియమంతా  గోలగోలగా ఉంది. స్టేడియంలో ఉపఖండం వాతావరణం కనిపిస్తుందని వ్యాఖ్యాతలు అన్నారు. దీనికతోడు అంతా బ్లూషర్ట్స్‌ వేసుకుని సందడి చేశారు. ఓ రకంగా ఇది భారత్‌ ఆటగాళ్లకు ఎంతగానో నైతిక స్థయిర్యం ఇవ్వనుంది.