సినిమాకు వెళ్లొచ్చే సరికి ఇల్లుగుల్ల

కర్నూలు,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): డోన్‌ పాత బస్టాండ్‌లో సవిూపంలోని బ్యూటీ పార్లర్‌ యజమాని విద్యాసాగర్‌ ఇంట్లో భారీ చోరీ జరిగింది. విద్యాసాగర్‌ మంగళవారం రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లాడు. తిరిగొచ్చేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉండటంతో అనుమానం వచ్చి గదిలోకివెళ్లి చూశాడు. బీరువాలో ఉన్న రూ.10లక్షల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే ప్రాంతంలో మంగళవారం పట్టపగలు ఓ ఇంట్లో చోరీ యత్నం జరిగింది. అది మరిచిపోకముందే సవిూపంలోనే రాత్రి తాళం వేసిన ఇంట్లో చోరీ జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

 

తాజావార్తలు