సిపిఎస్‌పై ప్రభుత్వ వైఖరేంటి
మండలిలో వాయిదా తీర్మనం చర్చకు ఎమ్మెల్సీల డిమాండ్
అమరావతి,సెప్టెంబర్18(జనంసాక్షి): సీపీఎస్‌కు తాము వ్యతిరేకమని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. మంగళవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రమణ్యం, బొడ్డు నాగేశ్వరరావు, యాండపల్లి శ్రీనివాసరెడ్డి, రామసూర్యారావు,
కత్తి నరసింహారెడ్డి విూడియాతో మాట్లాడుతూ సీపీఎస్‌పై అసెంబ్లీ చివరి రోజు చర్చించడం వల్ల ప్రయోజనమేంటి? అని వారు ప్రశ్నించారు. సీపీస్‌పై కమిటీ వేస్తామని ప్రభుత్వం సంకేతాలు ఇస్తోందని, దీని వల్ల సమస్యను పొడిగించడమే తప్ప ప్రయోజనం లేదన్నారు. సీపీఎస్ రద్దు కోసం రెండేళ్లుగా పోరాటం చేస్తున్నా టీడీపీ తన వైఖరి చెప్పడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం దిగొచ్చి సీపీఎస్ రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. అంతకుముందు సీపీఎస్ విధానం రద్దుపై, టీచర్ల అక్రమ అరెస్ట్‌లపై మండలిలో పీడీఎఫ్ సభ్యులు తీర్మానం ఇచ్చారు. కాగా తీర్మానాన్ని మండలి చైర్మన్ ఫరూక్ తిరస్కరించారు. దీంతో సీపీఎస్ విధానం రద్దు చర్చ జరపాల్సిందే అంటూ సభ్యులు పట్టుబట్టారు. అందుకు చైర్మన్ నిరాకరించడంతో పీడీఎఫ్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.