సిపిఎస్ రద్దు చేయాలి.. విద్య రంగ సమస్యలపై దృష్టి పెట్టాలి.

యూఎస్ పిసి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బైక్ ర్యాలీ ధర్నా.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు12.(జనంసాక్షి). సిపిఎస్ ను రద్దు చేయాలని ప్రభుత్వ విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఉపాధ్యాయులు కదం తొక్కారు. సిరిసిల్ల పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో సిపిఎస్ ను రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ విద్యారంగ సంస్థల్లో నెలకొన్న సమస్యలను తక్షణ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ తక్షణ పరిష్కారం చూపాలని కోరారు. కార్యక్రమంలో యు ఎస్.పి.సి నాయకులు దోర్నాల భూపాల్ రెడ్డి, దొంతుల శ్రీహరి, మహేందర్ రావు, కుమ్మరి మల్లేశం విజయ్ కుమార్, రాజేశ్వరరావు, వేణుగోపాలరావు, విష్ణు, గుండెల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు