సిపిఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): ఈ నెల 14 నుండి 18 వరకు విజయవాడలో జరిగే సీపీఐ 24వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ సూర్యాపేట పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.బుధవారం జిల్లా కేంద్రంలోని బొమ్మగాని ధర్మ బిక్షం భవన్ లో మహాసభల గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడారు.పీఎం మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆదానీ , అంబానీలకు ప్రభుత్వ ఆస్తులను అమ్మి వారిని ప్రపంచంలో మొదటి స్థానంలో నిలబెట్టడానికి కంకణం కట్టుకున్నారని విమర్శించారు.ఫాసిస్ట్ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ దేశంలో అరాచక పాలన కొనసాగిస్తున్నారని అన్నారు .ప్రజాతంత్ర లౌకిక శక్తులను , ప్రజాస్వామ్య శక్తులను ఏకం చేయడానికి ఈ మహాసభలు ఉపయోగపడతాయన్నారు.ఈ మహాసభలకు 32 దేశాల నుండి ప్రతినిధులు, నలుగురు సీఎంలు  పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. ఈ మహాసభలలో గత పోరాటాలపై సమీక్ష నిర్వహించి, ప్రస్తుతం దేశంలో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ, భవిష్యత్ రూపకల్పన చేస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మాజీ కౌన్సిలర్ దోరేపల్లి శంకర్ , ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోపగాని రవి , నిమ్మల ప్రభాకర్ , దికొండ శ్రీనివాస్ , రవి , రమేష్ , వెంకటరమణాచారి , వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు