సిరిసిల్ల నుంచి బడిలో ఉంటా….

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఇంచార్జ్ కటకం మృత్యుంజయం.

రాష్ట్రంలో అవినీతి పాలనపై ఆగ్రహం.

కేంద్రం అవినీతి ప్రభుత్వంపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం.

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అన్ని నియోజకవర్గాల నుంచి పోటీలో ఉంటుంది.

రాజన్న సిరిసిల్ల బ్యూరో, సెప్టెంబర్,28(జనంసాక్షి) .సిరిసిల్ల నుంచి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా బరిలో ఉంటారని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ ఇంచార్జ్ కటకం మృత్యుంజయం అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని అన్నారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి అవినీతి రహిత పాలన అందించేందుకు కట్టుబడి పని చేస్తామని అన్నారు. గంభీరావుపేట్ పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడిన తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వాలు చేసిన పనిమీద అదనంగా ఏమైనా చేశారా అంటూ ప్రశ్నించారు. వరద నీళ్లను కాలేశ్వరం నీళ్లుగా ప్రచారం చేసుకోవడం సిగ్గనిపించడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. కేంద్ర మంత్రులతో బిజెపి అగ్ర నాయకులందరూ కాలేశ్వరం ప్రాజెక్టును ఏటీఎం మిషన్ గా వాడుకున్నారని ప్రచారం చేస్తున్నారు కానీ చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడడంలో ఆ పార్టీ నాయకత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. రానున్న రోజుల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రభుత్వ పథకాల బండారాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్తామని అవినీతికి వ్యతిరేకంగా కలిసి వచ్చే అన్ని పార్టీలతో కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు. ఒక ప్రశ్నకు సమాధానం గా కరీంనగర్ లేదా సిరిసిల్ల నియోజకవర్గం నుండి కచ్చితంగా పోటీలో ఉంటామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పోటీలో ఉండదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి పాలనకు వ్యతిరేకంగా కలిసివచ్చే అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని అన్నారు. వివిధ మండలాల నుండి పార్టీలో చేరిన పలువు నాయకులకు కటకం మృత్యుంజయం కండువా కప్పి ఆహ్వానించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు మేకల కమలాకర్, గోపన్న గారి లక్ష్మీనారాయణ గౌడ్, బాబు, పలువురు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..