సిలిండర్ల లారీ బోల్తా ఘటనలో మరొకరు మృతి
గుంటూరు : చిలకలూరి పేట కాటూరు వైద్యకళాశాల వద్ద ఈ ఉదయం జరిగిన లారీ బోల్తా ప్రమాదంలో మరొరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 4కి చేరింది. ఒంగోలు నుంచి
రాజమండ్రి వెళ్తున్న గ్యాస్ సిలిడర్ల లారీ బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడ్డ మరో 9 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.