సిసి కెమెరాలు అందించిన అమర్‌దీప్‌ ఫౌండేషన్‌


చిత్తూరు,నవంబర్‌27(జ‌నంసాక్షి): అమర దీప్‌ పౌండేషన్‌ సేవలు ప్రశంసనీయమని పుత్తూరు డిఎస్‌పి భవాని హర్ష పేర్కొన్నారు. కార్వేటినగరం సిఐ కార్యాలయంలో మంగళవారం కార్వేటి నగర పోలీస్‌ సర్కిల్‌ వారు అమరదీప్‌ స్వచ్ఛంద సేవా సంస్థ కో ఆర్డినేటర్‌ రమణ మూర్తిని సత్కరించారు. గంగాధర నెల్లూరు
నియోజకవర్గం కార్వేటినగరం మండలంలోని కార్వేటి నగరం పోలీస్‌ సర్కిల్‌కు అమర దీప్‌ పౌండేషన్‌ వారు లక్ష రూపాయిల విలువ గల సీసీ కెమెరాలను వితరణ చేశారు. డిఎస్పీ, సిఐ, ఎస్‌ఐ లు కలిసి రమణ మూర్తిని శాలువాతో కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా పుత్తూరు డిఎస్‌పి భవాని హర్ష మాట్లాడుతూ.. అమర దీప్‌ పౌండేషన్‌ సేవలు ప్రశంసనీయమని, నేర నిర్మూలనకు అమర్‌ దీప్‌ పౌండేషన్‌ వారు అందించిన సేవలు అబినందయమని కొనియాడారు. కార్వేటినగరం సిఐ చల్లనిదొర మాట్లాడుతూ.. బెంగళూరుకు చెందిన అమర దీప్‌ స్వచ్ఛంద సేవా సంస్థ వారు లక్ష రూపాయల విలువ గల సీసీ కెమెరాలు వాటికి సంబంధించిన పరికరాలను కార్వేటినగరం పోలీసు శాఖ వారికి వితరణ చేశారని తెలిపారు. డిఎస్పి మాట్లాడుతూ.. అమర దీప్‌ స్వచ్ఛంద సేవ సంస్థ వారి సేవలు మరువలేనివన్నారు. పోలీస్‌ స్టేషన్లకు సీసీ కెమెరాలు ఇవ్వడం చాలా శుభ పరిణామమని, నేరాలను అరికట్టడానికి వీరి సహయం చాల ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వీరు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ చల్లని దొర, ఎస్‌ఆర్‌ పురం ఎస్‌ఐ వాసంతి, వెదురుకుప్పం ఎస్‌ఐ రామకఅష్ణ, తదితరులు పాల్గన్నారు.