సిసి రోడ్డు పనులను ప్రారంభించిన

-మండల అధ్యక్షుడు తోట లాలయ్య

-గ్రామాభివృద్దే లక్ష్యంగా కృషి చేస్తా
-సర్పంచ్ షేక్ మస్తాన్

కురవి సెప్టెంబర్-18 (జనం సాక్షి న్యూస్)

కురవి మండలం రాజోలు గ్రామంలో సర్పంచ్ షేక్ మస్తాన్ ఆధ్వర్యంలో సీసీ రోడ్ పనులు ప్రారంభించిన టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట లాలయ్య.ఆదివారం రాజోలు గ్రామంలో గంగుల మల్లేశం ఇంటి నుండి బతుకమ్మ ఘాట్ వరకు గ్రామ పంచాయతీ నిధుల నుండి 5 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను తోట లాలయ్య కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా తోట లాల్లయ్య,సర్పంచ్ షేక్ మస్తాన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్,డోర్నకల్ శాసనసభ్యుడు డిఎస్ రెడ్యా నాయక్ సహకారంతో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, విజయదశమి పండుగ ముందు బతుకమ్మ ఆటలు ఆడడానికి గ్రామ ఆడపడుచులకు ఆటంకాలు కలగకుండా ముందస్తుగా బతుకమ్మ ఘాటు వరకు సిసి రోడ్డు వేయించడం జరుగుతుందని,గ్రామ అభివృద్దే లక్ష్యంగా పనులు చేస్తామాని వాళ్లు అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షేక్ మస్తాన్, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఈడీగపల్లీ వీరేందర్ సీనియర్ నాయకులు బస్వ వీరేశ్,అంబటి విష్ణు వర్ధన్,కొక్కు రంగనాయకులు,ఎడ్ల వెంకన్న,గుంటక యాదగిరి,పోచారపు ఉప్పలయ్య,రాచగొల్ల సత్యనారాయణ, పాశం వెంకన్న,పార్టీ కార్యదర్శి చెవుల వెంకన్న,కేదాసు శ్రీను,మేకల మల్లయ్య,పడాల మల్లయ్య,బొడ్డు ఉపేందర్, అత్తునూరి నాగన్న,బస వెంకన్న,బట్టు రవి,బట్టు ఉప్పలయ్య,షేక్ కరీం, మేకల గంగాధర్, పొగుల రామూర్తి, మక్కల ఎల్లయ్య, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.