సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం.

సీఏంఆర్ఎఫ్ నిరుపేదలకు వరంగా మారిందని తెరాస సీనియర్ నాయకులు పంజ స్వామి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గాజులపల్లి గ్రామానికి కొత్త మల్లేశం కు 18000వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ కుమార్, నిఖిల్ రెడ్డి, రాజు, ప్రవీణ్, స్వామి, కనకయ్య, షాధుల్,గ్రామ తెరాస నాయకులు,తదితరులు పాల్గొన్నారు.