సీఎం కేసీఆర్‌కు బీజేపీ నేత కిషన్‌రెడ్డి సవాల్‌

కరీంనగర్: సీఎం కేసీఆర్ కేంద్రప్రభుత్వాన్ని కించపరిచేలా వ్యంగ్యంగా మాట్లాడారని, ముస్లిం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోపై చర్చకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా? అని సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ముస్లిం రిజర్వేషన్ల వల్ల బీసీలకు తీవ్ర నష్టం జరుగుతుందని, సీఎం కేసీఆర్ ప్రజలను విభజించి పాలిస్తున్నారని ఆయన అన్నారు. మతపరమైన రిజర్వేషన్లను అడ్డుకొని తీరుతామని, వసరమైతే ఢిల్లీలో అన్ని పార్టీలను కలుపుకుని ధర్నా చేస్తామని కిషన్‌రెడ్డి అన్నారు. అనంతరం కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలి మాట్లాడారు. బీజేపీ ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిందని, బీజేపీని దేశ వ్యాప్తంగా ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, తెలంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు.