సీఎం సహాయ నిధి చెక్కు ను అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నవంబర్ 7 (జనంసాక్షి)ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోగుడంపల్లీ మండలం పడియల్ తండా గ్రామానికి చెందిన రాథోడ్ హోమ్ సింగ్ అత్యవసర చికిత్స నిమిత్తం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రెండు లక్షల యాభై వేయిల రూపాయల ను మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు అందజేసిన జహీరాబాద్ శాసన సభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.