సీకె నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించటం గర్వకారణం

– భారత్‌ క్రికెట్‌ జట్టు అభివృద్ధికి పునాదులు వేసిన గొప్ప క్రికెటర్‌ సీకే
– సీకే నాయుడు విగ్రహం ఆవిష్కరించిన కుంబ్లే
మచిలీపట్నం, జులై24(జ‌నంసాక్షి) : భారత క్రికెట్‌ జట్టు మెట్టమొదటి కెప్టెన్‌ దివంగత సీకే నాయుడు విగ్రహాన్ని ఆయన స్వస్థలమైన మచిలీపట్నంలో ఏర్పాటు చేయడం గర్వకారణమని భారత క్రికెట్‌ మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే అన్నారు. మంగళవారం కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పర్యటించిన కుంబ్లే 13 ఎకరాల్లో రూ.15 కోట్ల నిధులతో నిర్మించనున్న అథ్లెటిక్‌ స్టేడియానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా పరిషత్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సీకే నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారత క్రికెట్‌ జట్టు అభివృద్ధికి పునాదులు వేసిన గొప్ప క్రికెటర్‌ సీకే నాయుడు అని కొనియాడారు. ఆయన విగ్రహాన్ని తన చేతుల విూదుగా ఆవిష్కరించటం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.  రాష్ట్ర క్రీడల మంత్రి కొల్లు రవీంద్ర, శాప్‌ ఎండీ బంగార్రాజు, శాప్‌ ఛైర్మన్‌ వెంకన్న చౌదరి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజావార్తలు