సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్,ఆగస్ట్24(జనంసాక్షి): సీజనల్ వ్యాధుల పట్ల వైద్యఆరోగ్య సిబ్బంది, అంగ న్‌వాడీ టీచర్లు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో సీతారాం అన్నారు. ఆరోగ్యకేంద్రం సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణులకు సీజనల్ వ్యాధులపట్ల అవగాహన కల్పించాలని, అలాగే సమతుల్య ఆహారం అందించాలన్నారు. జిల్లాలో డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున వాటి నివారణకు చర్యలు తీసుకోవాని అధికారులను ఆదేశించారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులకు సంబంధించి శాంపిళ్లను సేకరించి జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి ల్యాబ్‌లో పరీక్షలు చేయించి రిపోర్టుల ఆధారంగా వెంటనే చికిత్స అందించాలని ఆయన సూచించారు. అలాగే, జిల్లాలో సీజనల్ వ్యాధులపై గత కొన్ని రోజులు నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్‌లో పూర్తి సమాచారం సేకరించాలన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలందరికీ ఇంటింటికి తిరిగి నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ టాª`లబెట్స్ తప్పనిసరిగా వేయాలని అన్నారు. ఈ ట్యాª`లబెట్స్ వారు వేసుకునే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించి కార్యక్ర మం విజయవంతం చేయాలన్నారు.