సీజనల్ వ్యాధులు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమం

గరిడేపల్లి, ఆగస్టు 5 (జనం సాక్షి)
:శుక్రవారం జడ్పీహెచ్ఎస్ కీతవారిగూడెం స్కూల్ నందు సీజనల్ వ్యాధులు  పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హెల్త్ సూపర్వైజర్ అంజయ్య గౌడ్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల దోమల ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్ గునియా బోదకాలు వ్యాధి మెదడువాపు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని  నివారణలో భాగంగా దోమలు కుట్టకుండా చూసుకోవాలన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే పాటించాలన్నారు.
ఇంటి పరిసరాల్లో ఉండే చెత్తాచెదారం తొలగించాలని  కూలర్లు లో పాత టైర్లలో తాగి పడవేసిన కొబ్బరి బోండాలలో నిల్వ ఉన్న నీటిని  తొలగించాలని  మురికినీటి గుంటలను పూడ్చివేయాలని పూడ్చలేని గుంటలలో  మడ్డి ఆయిల్  కిరోసిన్ చుక్కలు వేయాలన్ని ఈ విధంగా చేయడం వల్ల దోమలు పుట్టకుండా ఉంటాయన్నారు. టైఫాయిడ్ డయేరియా వ్యాధులు రాకుండా మంచినీటిని కాచి చల్లార్చి వడపోసుకుని తాగాలన్నారు . ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ వీరనారాయణ , బయాలజీ టీచర్ దాడి నర్సిరెడ్డి, ఉపాధ్యాయులు ,పి ఈ టి, ఏఎన్ఎం రాజకుమారి, ఆశ కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు.