సీజనల్ వ్యాధులు ప్రభలకుండా జాగ్రత్తలు తీసుకొంటు అప్రమత్తంగా ఉండాలి

-జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రతి మంగళ, శుక్రవారం డ్రై డే పాటించాలి

వర్షాలు పడుతూ అనువైన వాతావరణం ఉన్నందున ప్లాంటేషన్ చేయాలి

మహబూబాబాద్ బ్యూరో-జూలై 7(జనంసాక్షి)

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే వర్షాలు పడుతూ అనువైన వాతావరణం ఉన్నందున ప్లాంటేషన్ కు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక ఎంపిడిఓ లను ఆదేశించారు. గురువారం కలక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై, ప్లాంటేషన్ పై సంభందిత జిల్లా అధికారులు, మండలాల వారీగా ఎంపిడిఓ లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాలు పడుతూ మంచి అనువైన వాతావరణం ఉన్నందున పిట్టింగు చేసిన మూడు నాలుగు రోజుల తర్వాత మొక్కలు నాటాలని, ఎక్కడైతే తక్కువ లక్ష్యం ఇస్తున్నమో వారు కూడా తక్కువ ప్లాంటేషన్ చేయడం జరుగుతున్నదని, వారం, రోజు వారి నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ప్లాంటేషన్ చేయాలన్నారు. ఎన్.ఆర్. ఈ.జి.ఎస్. లో పిట్టింగ్, ప్లాంటేషన్ కొరకు అవసరమైనంత మంది కూలీలు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు. ఈ వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోవాలని బ్లాక్ ప్లాంటేషన్, బృహత్ పల్లె ప్రకృతి వనాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. జిల్లాలో గల 461 గ్రామ పంచాయతీ లలో సొంత భవనాలు ఉన్న 210 లో టాయ్లెట్ లు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. లేనిచోట వెంటనే ఏర్పాటు చేయలని తెలిపారు. అనంతరం సీజనల్ వ్యాధులపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.  ఈ సందర్భంగా డాక్టర్ హరీష్ రాజ్ జిల్లాలో చేపడుతున్న ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలను వివరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి మంగళ వారం, శుక్రవారం డ్రై డేగా పాటించాలని, ప్రతి మూడు, నాలుగు వారాలకు ఒకసారి మండల స్థాయిలో కో ఆర్డినేషన్ కమిటీ సమావేశాలు నిర్వహించుకుని సమీక్షించుకోవాలి అని, ఆశ, ఏ.ఎన్.ఎం. అంగన్ వాడి లు ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటి పరిసరాలు పరిశీలించాలని, పరిశీలించినట్లు స్కెచ్ పెన్ తో వారి ఇంటి తలుపు పై నమోదు చేయాలనీ, ఇంటికి వెళ్ళే క్రమంలో డెంగ్యు, మలేరియా, సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు ముద్రించిన కరపత్రాలు అందించే ఏర్పాటు చేయాలని తెలిపారు. హాట్ స్పాట్ లను గుర్తించాలని, ఇంతకు ముందు ఇచ్చిన బెడ్ నెట్ లను ఎంతమేరకు వాడుతున్నది పరిశీలించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని, హాస్టల్, స్కూల్ లలో వంట వండే ప్రాంతాల్లో పరిశుభ్రం గా ఉండే విధంగా చూడాలని, నాలాల వద్ద నీరు ఆగకుండా చూడాలని, ఎక్కడా కూడా నీరు నిల్వ లేకుండా చూడాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ హరీష్ రాజ్, డిప్యూటీ డి.ఎం.హెచ్. ఓ, 16 మండలాల ఎంపిడిఓలు, మెడికల్ అధికారులు, డి.ఆర్.డి. ఓ. సన్యాసయ్య, డి.పి. ఓ.సాయిబాబా, జెడ్పీ.సీఈఓ రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Attachments area