సీజనల్ వ్యాధులు ప్రభలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్ బ్యూరో-జూలై 13(జనంసాక్షి)

సీజనల్ వ్యాధులు ప్రభలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక వైద్య అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత వైద్య అధికారులు, ఎంపిడిఓ లు, అధికారులతో సీజనల్ వ్యాధులపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ప్రతి మంగళ, శుక్రవారం డ్రై డే గా పాటిస్తూనే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని తెలిపారు. అవసరమైన మందులు, ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచుకోవాలని, సబ్ సెంటర్ వారీగా ఫిజికల్ స్టాక్ ను పరిశీలించి అవసరం మేరకు లభ్యతను కలిగి ఉండాలని తెలిపారు. అన్ని రకాల టెస్ట్ లను పెంచాలని, సర్పంచ్, ఆశ, పంచాయతీ సెక్రటరీ సహకారంతో గ్రామంలోని ప్రతి ఇల్లు కవర్ చేయాలని, సబ్ సెంటర్ మూసి వేసి ఉంచకుండా చూడాలని, టెస్ట్ చేసి వైద్య సేవలు అందించాలని, అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి టెస్ట్ లు చేయాలని తెలిపారు. వారానికి ఒకసారి గ్రామంలోని ఇంటిని ఆశ, ఎం.పి.హెచ్. సిబ్బంది పరిశీలించాలని, ఇంటి ఆవరణ శుభ్రంగా ఉండే విధంగా అవగాహన కల్పించి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాలని తెలిపారు. హాస్టల్, పాఠశాలల్లో వంట వండే సమయంలో, డైనింగ్ ప్రాంతాల్లో శుభ్రంగా ఉండే విధంగా చూడాలని, ప్రతి పి.హెచ్.సి. ల వారీగా ఎన్ని టెస్ట్ లు చేసింది, ఫలితాలు వివరాలతో కూడిన నివేదికను ఫార్మాట్ లో ప్రతి రోజూ తనకు పంపాలని తెలిపారు. గతంలో ఇచ్చిన నెట్ లను వాడుతున్నారా లేదా పరిశీలించాలని, ఎంపిడిఓ లు, వైద్య అధికారులు సమన్వయంతో హై రిస్క్, హాట్ స్పాట్ లను గుర్తించి పర్యటించి అవగాహన కల్పించాలని, అలాగే టెస్ట్ లు చేయాలని తెలిపారు. గత 5 సంవత్సరాల కాలంలో ఏ ప్రాంతంలో ఎక్కువగా కేసులు వచ్చాయి అనే విషయమై పరిశీలించి ఆ ప్రాంతాల్లో టెస్ట్ లు చేయించి ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. చికెన్ సెంటర్ లు, ఇతర వ్యర్థ పదార్థాలు వచ్చే ప్రాంతంలో పారిశుధ్యం పాటించాలని అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్, డిపిఓ సాయిబాబా, డిప్యూటీ డి ఎం హెచ్ వో లు, డి.ఎల్.పి. ఓ లు, ప్రోగ్రాం అధికారులు, ఎం.పి.డి. ఓ లు, ఎం.పి. ఓ లు, వైద్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.