సీజనల్ వ్యాధుల పట్ల గ్రామపంచాయతీ పాలకవర్గం అప్రమత్తంగా ఉండాలి: బీఎస్పీ మండల ఇన్చార్జ్ అజ్మీరా వెంకన్న డిమాండ్
బయ్యారం,జులై20(జనంసాక్షి):
మహబూబాబాద్ జిల్లా మండలంలో అధిక వర్షాల ప్రభావంతో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల గ్రామపంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని బుధవారం బహుజన్ సమాజ్ పార్టీ గార్ల , బయ్యారం మండల ఇంచార్జ్ అజ్మీర వెంకన్న విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు బయ్యారం మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలోని సర్పంచులు, కార్యదర్శులు అందరూ వారి వారి గ్రామపంచాయతీలలోని గ్రామాల్లో దోమల బెడద నివారణకు అన్ని గ్రామపంచాయతీలు నిరంతర ప్రక్రియగా చేపట్టాలని, తాగునీరు కలుషితం కాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, గుంతల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పంచాయతీ కార్యదర్శులు తరచుగా గ్రామాల్లో తనిఖీ చేయాలని అన్నారు.క్లోరినేషన్ చేపట్టగే గ్రామాలకు తాగనీరు అందించాలని మరియు సీజనల్ వ్యాధుల విషయంలో పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజు గ్రామాల్లో సమీక్షించాలని,అన్ని గ్రామ పంచాయతీలు బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉంచుకొని గ్రామాలలో శానిటైజేరింగ్ చేయాలన్నారు.వర్షాలు,వరదల వల్ల రోడ్డు మార్గాలు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడిన చోట కనీస సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.వైద్య విషయంలో గ్రామ ప్రజలకు వ్యాధులు ప్రబలకుండా ఆశ వర్కర్లు, ఏఎన్ఎం నర్సులు అందుబాటులో ఉండి చూసుకోవాలన్నారు
ప్రతి గ్రామ పంచాయతీలలో వర్షాల కారణంగా గ్రామ ప్రజలకు కలిగిన నష్టాలను పరిగణలో తీసుకొని ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపవలసిందిగా బహుజన్ సమాజ్ పార్టీ గార్ల,బయ్యారం మండల ఇంచార్జ్ అజ్మీర వెంకన్న డిమాండ్ చేశారు.